News

హిందువులంతా ఏకం కావాలి

63views

హిందువులంతా ఏకం కావాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి అన్నారు. కృష్ణాజిల్లా పామర్రులోని   స్థానిక మచిలీపట్నం రోడ్డులో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు, మన రాష్ట్రంలో, మనదేశంలో మతమార్పిడులు హిందూ మతం నుండి జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన భారత దేశంలో కోటి మంది హిందువులు ఏకమైతే అన్యమతస్తులు మన హిందూ మతం జోలికి రావడానికి భయపడతారన్నారు.

అనంతరం కోటిలింగా మహాసేవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ మతాన్ని రక్షిస్తుందని, తిరుపతిలో అన్యమత కార్యకలాపాలను అడ్డుకున్నది కేంద్రంలో ఉన్న మోడీని అన్నారు. ప్రతి ఒక్క హిందువు పురాతన ఆలయ పరిరక్షణకు పాటుపడాలన్నారు.

ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు తాళ్లూరి విష్ణువు, కృష్ణాజిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు బూరగడ్డ శ్రీనాథ్, వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఆంధ్ర తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ సదాశివ, లు పాల్గొని హిందూ మత ప్రాశస్యం, హిందూమత ఔన్నత్యం, తదితర విషయాలపై హిందూ బంధువులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ సమాజం పామర్రు మండలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.