News

సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత పూజ

936views

సంస్కృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో భరత మాత పూజా కార్యక్రమం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

భారతీయులందరూ ఒకే తల్లి భరతమాత సంతానం అని, మనందరి తల్లి భరతమాత అని ఆయన పేర్కొన్నారు. కనుక మనందరం సోదరులం అనే భావన భారతీయులందరిలో ఉండాలని, కుల, మత, ప్రాంత భేదాలకు అతీతమైన జాతీయ భావనను మనందరం కలిగి ఉండాలని, అందుకే ఈ భరత మాత పూజను నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతీయులు అందరిలో ఏకాత్మ భావనను నిర్మాణం చేసే భరతమాత పూజా కార్యక్రమాన్ని రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా నిర్వహించాల్సి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ సహ పరియోజన ప్రముఖ్ శ్రీ ముత్యాలరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక పెద్దలు శ్రీ గురు నాయుడు, శ్రీ అప్పలరాజు, శ్రీ ప్రసాద్, శ్రీ వెంకట నరసింహారావు తదితరులు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.