NewsProgramms

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు

1kviews

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట పరిసర గ్రామాల కబడ్డీ జట్లకు సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు జరిగాయి. మొత్తం 13 కబడ్డీ జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు మాట్లాడుతూ స్వామీ వివేకానంద ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువకులు తనకు అందుబాటులో ఉంటే ఈ దేశ గతిని మారుస్తానని చెప్పారని, అలాంటి వజ్ర సంకల్పం కలిగిన చైతన్య వంతులైన యువకుల అవసరం నేడు దేశానికి ఎంతో ఉన్నదని అన్నారు. భారతదేశంలో ఎంతో పురాతనమైన క్రీడ కబడ్డీ అనీ, కబడ్డీ, దేహ దారుఢ్యం తోపాటు, శారీరాన్ని, మనస్సును చురుగ్గా ఉంచగలుగుతుందని అన్నారు.

దేశ ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతున్న శక్తులు దేశంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని, అలాంటి దుష్ట శక్తులకు చైతన్యము, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన యువత మాత్రమే సమాధానం చెప్పగలరని, దేశానికి నేడు అలాంటి యువత ఎంతో అవసరమని శ్రీ శేషు పేర్కొన్నారు.

ఆరెస్సెస్ జిల్లా సంఘ చాలక్ శ్రీ ఆనంద్ రెడ్డి  శ్రీ పుట్టా శేషు విజేతలకు బహుమతులు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.