NewsProgramms

నంద్యాలలో కుల సంఘాల ఆత్మీయ సమావేశం

125views

ర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల సంఘమిత్రలో కుల సంఘ ప్రముఖుల  ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి 30 కులాల పెద్దలు 120 మంది పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అనేకమంది కుల పెద్దలు మాట్లడుతూ హిందువుల పై దాడులు ,మతమార్పిడిలను అడ్డుకోవడానికి  మా శాయశక్తులా  సహకరిస్తాం అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  ప్రదానవక్త విభాగ్ కార్య కారిణి సభ్యులు శ్రీ రఘురామ్ మాట్లాడుతూ లోకా సమస్తా సుఖినోభవంతు అని చెప్పగలిగే జాతి మన ఒక హిందూ జాతి మాత్రమే అని తెలియజేశారు.

సంఘే శక్తి కలౌ యుగే అనగా మనం సంఘటితంగా ఉన్నప్పుడే మనకు బలం ఉంటుంది. కాబట్టి మనమందరము ఐక్యమత్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలి అని తెలియజేశారు.

విభాగ సంఘచాలక్ డాక్టర్ ఉదయ్ శంకర్  మాట్లాడుతూ “దేశంలోని పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ధర్మం ఆధారంగా విడిపోయిన ముస్లిం దేశాలలో బాధలు పడలేక మాన ప్రాణాలు కాపాడుకోవడానికి శరణార్థులుగా వచ్చి ఏ సౌకర్యాలూ  హక్కులు లేక పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్న ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వటానికి చట్టం తెస్తే, ఎంత హంగామా చేస్తున్నారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ మీ మీ కుల సంఘాలను పటిష్టంగా ఉంచుకొని కనీసం నెలకు ఒకసారైనా మనం ఇలా ఆత్మీయంగా కలుసుకొని మంచి చెడు చర్చించుకుని మనమంతా ఐక్యంగా ఉన్నప్పుడే మనం అభివృద్ది చెందగలం. ఇలాంటి మత దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం అని తెలియజేశారు.

కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది తీర్మానాలు : 1. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అందరు కలిసి చేయడం 2. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కార్తీక వనభోజనాలను హిందూ వనభోజనాలు ఏర్పాటు చేయడం 3.దేవాలయంలో సామూహిక హారతులు 4.కుల సంఘాల పెద్దలు అందరూ సంవత్సరంలో 3 లేదా 4 సార్లు కలవాలి.  ఈ నాలుగు తీర్మానాలు కులసంఘాల సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ( విజయనంద్ గారు, (RSS జిల్లా సంఘ చాలక్ గారు)  DR. ఉదయశంకర్ గారు,  చిలుకూరీ శ్రీనివాస్ గారు, (RSS నగర సంఘ చాలక్) మనోహర్ గారు (విభాగ్ కార్యావాహ ) రాంప్రసాద్ గారు (విభాగ్ ధర్మజాగరణ ప్రముక్)  పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.