
ఒడిశాలోని అత్యంత గౌరవనీయమైన హిందూ యాత్రా స్థలాలైన జగన్నాథ ఆలయం , కోణార్క్ సూర్య దేవాలయం సమీపంలో బలవంతపు క్రైస్తవ మతమార్పిడులు, చట్టవిరుద్ధమైన ఖననాలు వ్యవస్థీకృత మతపరమైన బెదిరింపుల వంటివి జరుగుతున్నాయి. వీటిని పరిగణంలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అక్టోబర్ 1న పూరీ జిల్లా మేజిస్ట్రేట్ మరియు పోలీసు సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ నివేదికను NHRC కోరింది . అన్ని పరిశోధనలను తదుపరి పరిశీలన కోసం బెంచ్ సెక్రటేరియట్‌తో పంచుకోవాలని ఆదేశించింది.
NHRC చేసిన ఫిర్యాదులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు, పాస్టర్ జాషువా పట్టాభి , మరొకరు తాటిపాక డేవిడ్ అలియాస్ టి. డేవిడ్, ఒడిశా తీరం వెంబడి, ముఖ్యంగా పూరీ జగన్నాథ ఆలయం , కోణార్క్ సూర్య దేవాలయం సమీపంలో, ఈ ప్రాంత జనాభాను క్రైస్తవీకరణ చేసే ఉద్దేశ్యంతో రహస్య క్రైస్తవ మత మార్పిడి నెట్‌వర్క్‌కు నాయకత్వం వహించారని వారిద్దరూ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. తాజాగాపెంతకట పూరిలో జరిగిన అక్రమ క్రైస్తవ మతమార్పిడి కార్యక్రమం ముఖ్యంగా “ఉపవాస పునరుద్ధరణ” పేరుతో పేద తెలుగు, ఒడియా జాలరు కుటుంబాలను, ముఖ్యంగా స్త్రీలను, మైనర్ పిల్లలను మతం మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
పాస్టర్ జాషువా పట్టాభి…మతమార్పిడి నెట్కర్క్ ముఖ్య నిర్వాహకుడు
మతమార్పిడి నెట్‌వర్క్‌కు ముఖ్య నిర్వాహకుడిగా గుర్తించబడిన పాస్టర్ జాషువా పట్టాభి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలోని అపోస్టోలిక్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ నుండి పనిచేస్తున్నారు. అతని ఆన్‌లైన్ ప్రసంగాలు మరియు యూట్యూబ్ వీడియోలు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా అంతటా పెద్ద ఎత్తున మతమార్పిడి ని ప్రభావితం చేస్తుంటాయి..ఈ మతమార్పిడులు కూడా రాత్రిల్లే జరుగుతాయి. అందుకే అతన్ని, ఈ మతమార్పిడులను స్థానికులు వీటిని “రాత్రి మతమార్పిడి డ్రైవ్‌లు”గా అభివర్ణిస్తారు, పట్టాభి తన ప్రసంగాలలో”ఒక స్త్రీ, పిల్లలను మతమార్పిడి చేస్తే, మొత్తం కుటుంబం వారిని అనుసరిస్తుంది” అంటూ బహిరంగానేనే మతమార్పిడుల గురించి చెప్పారు.
NHRC ముందు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, అతని సెషన్లలో మానసికంగా ఒప్పించడం, డబ్బుల ఆశ చూపించడం లేదా మ్యాజిక రెమిడీస్ అంటే ఆరోగ్యం బాగుచేస్తామని ఇలా చెప్పడం చేస్తుంటాడు, ముఖ్యంగా మహిళలు మరియు మైనర్లు స్పృహ కోల్పోయేలా చేసే తెలియని పదార్థాలను అతను వాడుతున్నాడని నివేదించబడింది, ఇది డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 యొక్క నిబంధనలను ఉల్లంఘించే చర్యగా ఉండవచ్చు.
పట్టాభి కార్యకలాపాలు విదేశీ నిధులతో కొనసాగుతున్నాయని, పాస్టర్ తన సువార్త కార్యకలాపాలకు మద్దతు కోరడానికి తరచుగా విదేశాలకు వెళ్తుంటారని నివాసితులు ఆరోపిస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేయబడిన ఒక వీడియోలో, ఛత్తీస్‌గఢ్‌లో ఒక రాత్రి కార్యక్రమంలో 75 మంది మైనర్ బాలికలను మతం మార్చినట్లు అతను గొప్పగా చెప్పుకున్నాడు, దీనిని స్థానికులు “భారతీయ చట్టం మరియు సంస్కృతిని అపహాస్యం చేయడం” అని ఖండించారు. అంతేకాకుండా పూరీలో సైతం పట్టాభి తన మతమార్పుడుల ప్రాజెక్టును అనుసరిస్తున్నాడని, పిల్లలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని స్వస్థత కూటములను నిర్వహించాడని స్థానికులు చెబుతున్నారు
.
తాటిపాక డేవిడ్ అలియాస్ టి. డేవిడ్ — ది లోకల్ ఎనేబుల్
నరింగపురంలోని బెథెస్డా రివైవల్ ఫెలోషిప్ చర్చికి నాయకత్వం వహిస్తున్న టి. డేవిడ్, పట్టాభికి ఒడిశా లింక్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీరప్రాంత మత్స్యకార వర్గాలలో “పునరుజ్జీవనం” కోసం అతని వీడియోలు పిలుపునిస్తున్నాయి. అతను డబ్బు, వైద్య సహాయం, విద్య హామీలతో పేద మహిళలు, మైనర్లు మరియు వికలాంగులను లక్ష్యంగా చేసుకుని లాజిస్టిక్స్, సమీకరణ , క్రైస్తవీకరణలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.
పెంతకటలోని క్రైస్ట్ చర్చిలో డేవిడ్ స్థావరం ఈ కార్యకలాపాలకు కేంద్రంగా పేర్కొనబడింది, అక్కడ అతను పాస్టర్ మార్క్‌తో కలిసి “జగన్నాథుని ప్రాంతంలో ఉన్న హిందువులందరినీ క్రైస్తవీకరణగా మార్చడానికి” పనిచేస్తాడు.
పెంతకట బీచ్‌లో పట్టాభి అనుచరులు తెలియని మృతదేహాలను శవపేటికలలో పాతిపెట్టారని, అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకుని తీరప్రాంతాన్ని క్రైస్తవ స్మశానవాటికగా మార్చారని ఫిర్యాదులో ఆరోపించారు. స్థానికులు ఖననాలను చూపించే జియోట్యాగ్ చేయబడిన వీడియోలను అందించారు, అటవీ తీరప్రాంత రక్షణ చట్టాలను ఉల్లంఘించి అవయవాల అక్రమ రవాణా లేదా నేరపూరిత దాచిపెట్టడానికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.





