ArticlesNews

హిందూ ధర్మంపై గురూజీ-సుప్రీంకోర్టు ఏకాభిప్రాయం

4views

‌ప్రస్తుతం హిందుత్వ కేసుగా విస్తృతంగా పేరొందిన ఆర్‌.‌వై. ప్రభు వర్సెస్‌ ‌పి.కె.కుంటే ఏఐఆర్‌ 1996 ఎస్‌సీ 1113 కేసులో, హిందుత్వ భావజాలం మతతత్వపరమైనదేనా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం సుప్రీంకోర్టుకు ఏర్పడింది. హిందూ ధర్మాన్ని ఈ దేశ ప్రజల సర్వవ్యాప్తమైన జీవన విధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వితీయ సర్‌సంఘచాలక్‌ ‌గురూజీ ఎల్లప్పుడూ పేర్కొనేవారు. అది ఒక సంకుచితమైన మతం కాదని స్పష్టం చేశారు. దానిని హిందూ సంస్కృతి అని కూడా పిలిచేవారు. దశాబ్దాల తర్వాత ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది.

హిందూ ధర్మాన్ని స్థూలంగా ఒక జీవన విధానంగా మాత్రమే వర్ణించవచ్చు. వాస్తవానికి ఇది ఏ మతం లేదా విశ్వాసానికి సంబంధించిన సంకుచిత సాంప్రదాయ లక్షణాలకు సరిపోలదు (హిందుత్వ కేసు తీర్పు, పేజీ 1127). ‘హిందుత్వ’ లేదా ‘హిందూ ధర్మం’ అనే పదాలను లౌకికవాదాన్ని ప్రోత్సహించడానికి లేదా భారతీయ ప్రజల జీవన విధానం, భారతీయ సంస్కృతి లేదా జీవన దృక్పథాన్ని నొక్కిచెప్పడానికి ఉపయోగించవచ్చని కూడా కోర్టు పేర్కొంది (హిందుత్వ కేసు తీర్పు, పేజీ 1132). అంటే దశాబ్దాల క్రితం గురూజీ చెప్పిన మాటలతో సుప్రీంకోర్టు అక్షరాలా ఏకీభవించింది. ఈ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి.

ఫండమెంటలిజం ప్రాజెక్ట్ ‌మొదటి సంపుటం 1991లోనూ, చివరిదైన ఐదవ సంపుటం 1995 లోనూ ప్రచురితమయ్యాయి. ఇక్కడ ప్రస్తావించిన నాలుగవ సంపుటం 1994లో వెలువడింది. హిందుత్వపై సుప్రీంకోర్టు తీర్పు 1995లో వచ్చింది. 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌గా బాధ్యతలు చేపట్టిన గురూజీ 1973లో కన్నువ•శారు. అంటే, ఫండమెంటలిజం ప్రాజెక్ట్ ‌సంపుటాలు, సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి రెండు దశాబ్దాలకు పైగా ముందే, అంటే 1940 నుండి 1973లో తమ జీవిత చరమాంకం వరకు 33 ఏళ్లపాటు గురూజీ సర్‌ ‌సంఘచాలక్‌గా ఉంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయినప్పటికీ, అప్పట్లో విచక్షణా రహితంగానూ, కొన్నిసార్లు దురుద్దేశపూర్వకంగానూ విమర్శలకు గురైన గురూజీ ఆలోచనలు, అభిప్రాయా లను ఫండమెంటలిజం ప్రాజెక్ట్, ‌సుప్రీంకోర్టు సమర్థించాయి.

కాబట్టి, సారాంశంలో, దశాబ్దాల క్రితం గురూజీ మాట్లాడిన మాటలు 1990ల నాటి ‘ఫండమెంట లిజం ప్రాజెక్ట్’‌లో ఉన్న హిందూ ధర్మపు మేధోపరమైన, సాంస్కృతికపరమైన, ధార్మికపరమైన విశ్లేషణకు అనుగుణంగా ఉండటమే కాకుండా, హిందుత్వకు సంబంధించి సుప్రీంకోర్టు లౌకిక రాజ్యాంగ దృక్పథానికి కూడా అనుగుణంగా ఉన్నాయి. గురూజీ మాట్లాడినప్పుడు, ఆయన అభిప్రాయాలు లౌకిక వ్యతిరేకమైనవిగా, మతతత్వ మైనవిగా విమర్శలు ఎదుర్కొన్నాయి. కానీ గురూజీ వ్యక్తీకరించిన అవే అభిప్రాయాలు తరువాత ఫండమెంటలిజం ప్రాజెక్ట్ ‌మేధోపరమైన మదింపు ద్వారా, సుప్రీంకోర్టు న్యాయపరమైన పరిశీలన ద్వారా ఆమోదానికి, సమర్థనకు నోచుకున్నాయి. దీని అర్థం ఏమిటంటే, గురూజీ మాట్లాడిన మాటలు ఆయన కాలానికి చాలా ముందున్నాయి. గురూజీ ఆలోచనలు తరువాత ఎలా ఆమోదయోగ్యంగా మారాయో చూపించడానికి ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వివిధ విషయాలపై గురూజీ అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా సమర్థనకు నోచుకున్నదీ వచ్చే ఉదాహరణలు మరింత సమగ్రంగా వెల్లడిస్తాయి. కానీ ఆ గంభీరమైన ప్రయత్నం ప్రారంభమయ్యే ముందు, గురూజీ గురించి తెలియని వారి కోసం ఆయన నేపథ్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాము.

దేశం కోసం తన సర్వస్వాన్ని అంకితం చేసిన ఆధ్యాత్మికవేత్త గురూజీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండవ సరసంఘచాలక్‌. ‌డాక్టర్‌ ‌కేశవ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గెవార్‌ ‌స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మౌలికమైన ఉద్యమం. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ను కొందరు తక్కువగా అర్థం చేసుకున్నారు. అన్యాయంగా అంచనా వేశారు. హెడ్గెవార్‌ ‌స్వయంగా గోల్వాల్కర్‌ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్నారు. స్వభావం, శిక్షణ, వ్యక్తిత్వ పరంగా ఆధ్యాత్మికవేత్త అయిన గురూజీ, శ్రీ రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడైన స్వామి అఖండానంద వద్ద దీక్ష పొందిన శిష్యుడు. ఒక తెలివైన యువకుడిగా ఉన్న గురూజీ, భారతీయ సంప్రదాయంలోని మహర్షుల మాదిరిగానే, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్మాణంలో తన సర్వస్వాన్ని సమర్పించు కొని ఒక గొప్ప మేధావిగా ఎదిగారు. ఆయనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక కోణం బహుశా ఆయన ఆలోచనలను, చర్యలను సూక్ష్మంగా ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆ ఆధ్యాత్మికత వల్లే, గురూజీ సమకాలీన పరిస్థితుల బలమైన ప్రభావాలను ఎదిరించి అధిగమించగలిగారు. తాత్కాలిక సమస్య లకు అతీతంగా భవిష్యత్తు వైపు చూడగలిగారు. ఆ దృక్పథం నుంచి చూస్తున్నప్పుడు సందర్భాన్ని విస్మరించడం వల్ల కలిగే తీవ్ర వేదనను అధిగమించి, ప్రజలు, దేశం అంతరాత్మను తట్టిలేపగలిగారు. అందుకే, గురూజీని తెలిసిన చాలామంది ఆయనను ద్రష్ట (దూరదృష్టి గల జ్ఞాని)గా భావిస్తారు.

ఆయన కేవలం తన కాలానికి మాత్రమే పరిమితం కాకుండా, భవిష్యత్తుపై దూరదృష్టితో ప్రాచీన హిందూతత్వాన్ని, జీవన విధానాన్ని అవిశ్రాంతంగా వివరించారు. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరంతరం పర్యటించి, ప్రజలను కలుస్తూ, తన ఆలోచనలను వారితో పంచుకుంటూ, ప్రపంచంలోనే అత్యంత బలమైన క్షేత్రస్థాయి సంస్థను ఆయన నిర్మించారు. ఆయన ప్రసంగాలలో కనిపించే మేధోపరమైన, నైతిక ధైర్యం, అలాగే తన భావాలను వివరించడంలో ఆయన ప్రదర్శించిన స్పష్టత అద్వితీయమైనవి. గురూజీ జీవించి ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత ఆయన ఆలోచనలను ప్రశ్నించిన వారు కూడా, ఆయనకున్న దృఢ విశ్వాసం, ఆయన లక్ష్యం లోని చిత్తశుద్ధిని కాదనలేకపోయారు. భారతదేశ విభజన ఉద్యమం ప్రమాదకర స్థాయికి చేరు కుంటున్న తరుణంలో 1940లో గురూజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకత్వాన్ని స్వీకరించారు. కాబట్టి, ఆ విభజన ఉద్యమం రేకెత్తించిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన ఆలోచనలలో కొన్నింటిని అర్థం చేసుకోవాలి. ఆ సంక్షోభ సమయాల నుండి, దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పావు శతాబ్దానికి పైగా కాలం వరకు, సమకాలీన పరిస్థితు లకు అనుగుణంగా మాట్లాడినప్పటికీ, భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై గురూజీ తన అభిప్రాయాలను అచంచలమైన స్థిరత్వంతో వ్యక్తం చేశారు.

ఆధునిక చరిత్ర వెలుగులో గురూజీ తన జీవితకాలంలో మాట్లాడిన మాటలను గుర్తుచేసు కుంటే, ఆయన ఆయా సందర్భాలలో మాట్లాడి నప్పటికీ, ఆయన చెప్పిన చాలా విషయాలు భవిష్యత్తుకు మరింతగా వర్తించేవనే వాస్తవం వెల్లడవుతుంది. తన అభిప్రాయాలను వ్యక్తపరిచే టప్పుడు, గురూజీ ఆనాటి సందర్భపు ఒత్తిళ్లను, సమకాలీన ఆకర్షణలను ధిక్కరించి, హిందూ భారతదేశపు శాశ్వత ధ్యేయాన్ని ప్రజల ముందు ఉంచేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా గురూజీ వ•డు దశాబ్దాలకు పైగా భారతదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన పరమపదించి దాదాపు ఐదు దశాబ్దాలు అవుతోంది. కానీ ఆయన పని ఆయనతో ముగిసిపోలేదు. సమాజంపై అపారమైన ప్రభావాన్ని చూపే సంస్థగా ఆయన తీర్చిదిద్దిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వారా అది కొనసాగుతూనే ఉంది. ఆయన తన వెనుక అత్యున్నత నాణ్యత కలిగిన, శిక్షణ పొందిన అపారమైన మానవ వనరులను వదిలివెళ్లారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేసే పని ద్వారానే నూతనంగా పునరుద్ధరణకు నోచుకుంటు న్నది. ఈ నాణ్యమైన మానవ వనరులే ఆయన కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి.

కానీ గురూజీ ప్రవక్త కాదు. ఆయన ప్రవచించలేదు. ఆయన కేవలం ఒక ద్రష్ట – అంటే దార్శనికుడు. నిజానికి, హిందూ సంప్రదాయం ఏ ప్రవక్తను గానీ, ప్రవచనాన్ని గానీ గుర్తించదు లేదా నమ్మదు. హిందూ ధర్మం ప్రవచనాలను ప్రతిపాదిం చదు. ఇతర సంప్రదాయాలలోని ప్రవక్తలు తాము ఏకైక సత్య మతంగా, దేవుడిగా భావించేవాటిని కనుగొని, వాటిని తమ అనుచరులకు నిర్దేశిస్తారు. అదే సమయంలో, మిగతా మతాలు, దేవుళ్లు అసత్య మని కూడా ప్రకటిస్తారు. ఒక ప్రవక్త ప్రతిపాదించిన సత్యమే అంతిమ, ఏకైక సత్యం అవుతుంది. ఇది అన్ని ఏకేశ్వరవాద విశ్వాసాలకు వర్తిస్తుంది. వీటిని తర్వాతి భాగాలలో వివరంగా వివరించడం జరిగింది. కానీ అంతిమ సత్యం ఒక్కటే అనేది హిందూ ధర్మానికి పునాదిగా ఉంటుంది. కానీ రుషులు దీనిని విభిన్నంగా చూస్తారు, వివరి స్తారు. అందువల్ల, ఒక ఆరాధనా విధానం సత్యం, మిగతావి అసత్యం అని గానీ, లేదా ఒక దేవుడు సత్యం, మిగిలిన దేవుళ్లు అసత్యం అని గానీ చెప్ప డంలో అర్థం లేదు. అందువల్ల గొప్ప దార్శనికులు ఎప్పటికప్పుడు వచ్చి ప్రజలకు మార్గదర్శనం చేస్తారని, దార్శనికుల పరంపర అంతులేని ప్రవాహంలా కొనసాగుతుందని హిందువులు నమ్ముతారు. కాబట్టి, ప్రవక్తలు ప్రతిపాదించిన విశ్వాసాల విషయంలో లాగా, ఏ ఒక్కరి ఆలోచన కూడా అంతిమ ప్రవచనం కాదు లేదా అన్ని కాలాలకు చెల్లుబాటు అయ్యేది కాదు. అందువల్ల హిందూ ధర్మాన్ని ఏ ఒక్క వ్యక్తి ప్రతిపాదించలేదు. రుషులు, దార్శనికులు హిందూ ధార్మిక సూత్రాలను వివరిస్తారు.

గతంలోని ఆలోచనల చెల్లుబాటు కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజలు వాటిని అనుసరిస్తూ ఉంటే, వారు గతంలోనే స్తంభించిపోయి, చరిత్ర గమనంలో తిరస్కారానికి నోచుకుంటారని హిందూధర్మం విశ్వసిస్తుంది. లేకపోతే, వివిధ మత సిద్ధాంతాలు, ప్రవచనాలు చేసినట్లే, వారు సమాజానికి, ప్రపంచానికి అపారమైన హింసను, హానిని కలిగిస్తారు. కాబట్టి, భవిష్యత్తులో మార్గదర్శనం కోసం గతంలో ఒక దార్శనికుడు చెప్పినదాన్ని అంగీకరించే ముందు, ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి ఎప్పటికప్పుడు జన్మించే మహనీయుల నిరంతర సంప్రదాయంలో, దార్శనికుడి పాత్ర ఒక అధ్యాయం మాత్రమేనని హిందువులు అర్థం చేసుకుంటారు. అందువల్ల హిందూ ధర్మం ప్రవచనం, ప్రవక్తలు అనే భావననే తిరస్కరిస్తుంది. ద్రష్టలను మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఒక వ్యక్తి ద్రష్ట (దార్శనికుడు) అవునో కాదో తెలుసుకోవడానికి అతని ఆలోచనలు కేవలం సందర్భోచితమైనవా, అంటే ఆనాటి అవసరాలను, కోరికలను తీర్చడానికా? లేదా తన కాలంలోని ప్రజల ఆమోదాన్ని పొందడానికి ఉద్దేశించినవా, లేక అతను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమకాలీన పరిస్థితికి అతీతంగా మాట్లాడాడా? అనేది అవగతం చేసుకోవడం మొదటి పరీక్ష అవుతుంది.

వర్తమానపు ఒత్తిళ్లను ధిక్కరించి, ఇష్టపూర్వకంగా అపఖ్యాతిని ఎదుర్కొని, సత్యం వైపు నిలబడి దానిని చెప్పడానికి సిద్ధపడ్డారా లేదా అన్నదే కీలకమైన పరీక్ష. అన్నింటికన్నా అంతిమ పరీక్ష ఏమిటంటే, భవిష్యత్తు ఆ ఆలోచనలను ధృవీకరించిందా లేదా అనేది. 60 సంవత్సరాల క్రితం గురూజీ పలికిన మాటలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పలికారా? లేక సందర్భాన్ని ఒక ఒత్తిడిగా భావించి పలికారా? ఆయన తర్వాత చరిత్ర వాటిని ధృవీకరించిందా? లేక తిరస్కరించిందా అన్నదే ఇక్కడి విశ్లేషణ సారాంశం.

ప్రస్తుత సందర్భంలో గురూజీ ఆలోచనలు, సూక్తులను లోతుగా పరిశీలించి, విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. ఈ విశ్లేషణ చివరికి గురూజీని ఒక దార్శనికుడిగా చూపిస్తుంది. ఆయన సందర్భాన్ని, దాని ఒత్తిళ్లను, పరిమితులను అధిగమించి, భవిష్యత్తును చూడగలిగే ఒక ఉన్నత స్థానానికి ఎదిగారు. ఈ క్రమంలో, ఆయన పలికిన మాటలు కాలానికి ముందే ఉన్నందున అప్పుడు ఆమోద యోగ్యం కానివిగా,జనాదరణ లేనివిగా ఉన్నాయి, కానీ సకాలంలో అవి సర్వజనామోదం పొందాయి.

(ఎస్‌.‌గురుమూర్తి రచించిన ‘‘గోల్వాల్కర్‌ ‌ది మోడరన్‌ ‌రిషి విత్‌ ‌మిల్లేనియల్‌ ‌విజన్‌’’ ‌పుస్తకం నుంచి)