
హిందూ సమాజం ప్రమా దంలో ఉందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ ధర్మం అనేది మతం కాదని, అదొక జీవన విధానమని స్పష్టంచేశారు. దీన్ని ఆచరించేలా ఇతర మతస్థులతో సమా నంగా హిందువులకూ హక్కులు కావాలని డిమాండ్ చేశారు.
ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్ సంస్థ ఆధ్వర్యంలో ‘హిందువులకు సమాన హక్కుల నిరాకరణ. రాజ్యాంగ వివక్ష అంశంపై హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ క్లబ్ లో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగే శ్వరరావు మాట్లాడుతూ… ‘పశుబలిని నిషేధించినా.. ఎగుమతుల కోసం జంతువులను యథేచ్ఛగా వధిస్తున్నారు. హిందూ విశ్వాసాలను మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తూ.. ఇతర మతాలవి మాత్రం హేతుబద్దం చేస్తున్నారు. తరాలుగా వస్తున్న హైందవ విజ్ఞానాన్ని, నాగరికతను భావితరాలకు అందనీయకుండా రాజ్యాంగం నిరోధిస్తున్నందున 25 నుంచి 30 వరకున్న అధికరణల సవరణ అత్యవసరం. దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుంచి విడిపించడానికి రాష్ట్రాల చట్టాలను రద్దు చేసి.. కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలి” అని డిమాండ్ చేశారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… పూర్వీకులు దేవాలయాలకు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయని ఆరోపించారు.
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ… మత పెద్దలు నోరు విప్పాలని, హిందువులపై జరుగుతున్న వివక్ష గురించి ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.





