
214views
జాతీయ విద్యా విధానం (2020)లోని అభ్యసన ఫలితాల ఆధారిత పాఠ్యప్రణాళిక కూర్పులో భాగంగా డిగ్రీ కోర్సుల్లో కాలగణన, భారతీయ బీజగణితం, పురా ణాలకు సంబంధించిన పాఠాలను చేర్చాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదించింది. నారద పురాణంలో కనిపించే రేఖాగణితం, ప్రాథమిక అంకగణితం భావనలను మేథమ్యాటిక్స్ విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అంశాల్లో చేర్చనుంది. వేదిక్ గణితం, పంచాంగం, ముహూర్తాలను నిర్ణయించడం, పండగల తేదీలను నిర్దేశించడం వంటివి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని పేర్కొంది. ఆయా అంశాల్లో పరిశోధనల దిశగానూ విద్యార్థులను ప్రోత్సహించాలని యూజీసీ ముసాయిదా ప్రతిపాదించింది.




