News

సంఘ్ రహస్య సంస్థ అనే వారికి వ్యాఖ్యాన మాల ఓ కనువిప్పు : అలోక్ కుమార్

253views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ రహస్య సంస్థ అనే వారికి మూడు రోజుల ‘‘వ్యాఖ్యాన మాల’’ కనువిప్పు కలిగిందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని భవన్ మూడు రోజుల పాటు ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. సరసంఘచాలక్ మోహన్ భాగవత్ రెండు రోజుల పాటు ఉపన్యసించారు. చివరి రోజు శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

వ్యాఖ్యాన మాల ద్వారా సంఘ్ ఎలా పనిచేస్తుందో విమర్శకులకు తెలిసివచ్చిందని అలోక్ కుమార్ అన్నారు.‘‘ఆరెస్సెస్ రహస్యంగా పనిచేస్తుంది. రహస్య సంస్థ అనే వారి కళ్లు తెరుచుకొని వుండాలి. శ్రోతల సందేహాలకు మోహన్ భాగవత్ స్పష్టమైన సమాధానాలిచ్చారు. ప్రతి ఒక్కరికీ సంఘ్ గురించిన అపోహలు పటాపంచలయ్యాయి. వారి సందేహాలన్నీ తొలగిపోయాయని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

ఇక.. ఆరెస్సెస్ జ్యేష్ఠ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ కూడా స్పందించారు. మూడు రోజుల పాటు మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మోహన్ భాగవత్ ప్రస్తావించిన అంశాలన్నీ ప్రస్తుత సమాజానికి ప్రాథమిక అవసరాలు అని పేర్కొన్నారు.

“ఆయన చెప్పిన అన్ని విషయాలపై వివరణాత్మక చర్చలు జరగాలి. ఏ సమస్య కూడా తక్కువ కాదు. అన్నీ ప్రస్తుత సమాజం, భారత్ మరియు ప్రపంచం యొక్క ప్రాథమిక అవసరాలు. దీని గురించి చర్చించాలి” అని ఇంద్రేష్ కుమార్ అన్నారు.