News

భారత పురాతన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రం

217views

శుభాంశుతోపాటు గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపి కైన వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజీత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ లు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంలో ప్రసంగించారు. భారత పురాతన నాగరికతకు సంబంధించిన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రం ఉందని నాయర్ పేర్కొన్నారు. “మనది చాలా పురాతన నాగరికత. నాడు మనం చాలా ముందుండేవాళ్లం. అప్పట్లో ప్రపంచం మనల్ని అనుసరించేది. నేడు తిరిగి మన సత్తా చాటుతున్నాం” అని తెలిపారు. భారత జ్యోతిష శాస్త్రంలో ఖగోళశాస్త్రం కూడా మిళితమై ఉండేదన్నారు. రామాయణంలో ‘మిషన్ కంట్రోల్’ వ్యవస్థ మొత్తం ఉండేదని పేర్కొన్నారు. హనుమంతుడు తన బృందం సాయంతో వ్యోమగామిలా దూసుకెళ్లేవాడని తెలిపారు. రోదసి పరిశోధనలు భూమి మీద జీవంతో సంధానమై ఉండాలని అజీత్ తెలిపారు. వీటివల్ల మానవులకు ఉపయోగం ఉండాలని పేర్కొన్నారు. మానవసహిత అంతరిక్షయాత్ర.. శాస్త్రీయ పరిశోధనలకు దోహదపడుతుందని చెప్పారు.