
భారత విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా హర్షవర్దన్ ష్రింగ్లా నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ష్రింగ్లాను విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ వెల్లడించింది. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విజయ్ కేశవ్ గోఖలే రెండేళ్ల పదవీ కాలం వచ్చే నెల 28తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ష్రింగ్లాను నియమిస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. 2020 జనవరి 29 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన హర్షవర్దన్ ష్రింగ్లా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. తన 35 ఏళ్ల దౌత్యపరమైన వృత్తిలో ఆయన బంగ్లాదేశ్, థాయిలాండ్‌లో భారత హైకమిషనర్‌గానూ సేవలందించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





