News

రోహింగ్యాలకు అత్తారిళ్లు హైదరాబాద్

840views

దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా పరిణమిస్తారని భావిస్తున్న, కేంద్రం ఎంతగానో ఆందోళన చెందుతున్న రోహింగ్యాలకు  హైదరాబాదులో ఇంటి అల్లుడికి జరిగినట్టు మర్యాద జరుగుతుంది.  హైదరాబాద్ వస్తే చాలు ఒక్క ఓటర్ ఐడి ఏంటి వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు కూడా లభిస్తుంది.

హైదరాబాదులోని పాతబస్తీ నియోజకవర్గాలలో జరుగుతున్న ఈ భాగోతం నివ్వెర పరుస్తోంది. హైదరాబాదులోని బాలానగర్ పరిసర ప్రాంతంలో డి ఆర్ డి ఎ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న బిస్మిల్లా కాలనీ, రాయల్ కాలనీ తదితర ప్రాంతాలలోనే సుమారు ఏడు వేలమంది అక్రమ రోహింగ్యా శరణార్థులు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.

 జిహెచ్ఎంసి పరిధిలోని సర్దార్ మహల్ వద్ద ఉండే దళారులు, మీసేవ కేంద్ర నిర్వాహకులు, వీఆర్వోలు  కేవలం వెయ్యి రూపాయలు ఇస్తే చాలు రోహింగ్యాలకు ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. దాని ఆధారంగా ఆ తర్వాత వారు ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ లు కూడా పొందగలుగుతున్నారు. దేశ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే ఇలాంటి విషయాలలో సదరు వ్యాపారులకు, ఉద్యోగులకు కనీస స్పృహ, బాధ్యత లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్, చార్మినార్ నియోజకవర్గాలలో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు ఇకనైనా శ్రద్ధ పెట్టి ఇలాంటి చొరబాటుదారులు భారత పౌరసత్వం పొందకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.