
198views
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన శంకుస్థాపనతో 2020 ఆగస్టు 5న ప్రారంభమై అయిదేళ్లు కొనసాగిన అయోధ్య రామమందిర నిర్మాణ ప్రక్రియ మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చిన 5 ప్రత్యేక కెమెరాల్లో రికార్డు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ రికార్డింగులను ‘‘మేధో సంపత్తి హక్కులు’’గా రామమందిర ట్రస్టు ప్రకటించింది. ఈ హక్కులను రూర్కీలోని ‘సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సీబీఆర్‌ఐ)కు స్వాధీనం చేసి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ఆ సమాచారాన్ని విద్య, శిక్షణ, డాక్యుమెంటరీల తయారీకి ఉపయోగించుకోవచ్చని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. అక్టోబరు నెలాఖరుకు ఆలయ నిర్మాణ పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయన్నారు.





