
1.5kviews
నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) దాటి భారత భూభాగంలోకి వెళ్లవద్దని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ దేశంలోని ఉగ్రవాదులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇది భారత్ ‘కథనాల’కు మరింత బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. దీనిద్వారా తమ దేశంలో ఉగ్రవాదులున్నారన్న అంశాన్ని ఇమ్రాన్‌ఖాన్ ధృవీకరించినట్లయ్యింది. “ఎల్‌ఒసి దాటి జమ్ము కాశ్మీర్‌లోకి వెళ్లకండి. అది భారత్ కథనాలకు మరింత బలాన్నిస్తుంది” అని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





