News

హిందూ నేతలపై ఉగ్ర గురి

657views

మిళనాడుకు చెందిన హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు నలుగురు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో తిరుపూర్, నాగర్ కోయిల్ లలో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను కూడా విడుదల చేశారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాట విద్యార్థులు, ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హిందూ నేతలను హతమార్చేందుకు ఖాజా మొయినుద్దీన్, అబ్దుల్ సలీమ్, సయ్యద్ అలీ నవాజ్, అబ్దుల్ సమద్ అనే ఉగ్రవాదులు హిందూ నేతలను వెంబడిస్తున్న టు పోలీసులకు సమాచారం అందింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.