News

అన్య మత ప్రచారకులకు అక్కడ నో ఎంట్రీ

323views

మా గ్రామంలో ఉన్నవారంతా హిందువులే. ఇతర మతాలవారు మా గ్రామంలోకి ప్రవేశించి మత ప్రచారం చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటాం” అని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కరగాం పంచాయితీ కి చెందిన నారాయణ వలస గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గ్రామ ముఖ ద్వారం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

గ్రామంలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి యువత, పెద్దలు భజనలు చేస్తూ హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. చిన్న గ్రామమైనా నారాయణ వలసలో నాలుగు భజన బృందాలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఈ గ్రామానికి చెందిన భజన మండళ్ళు పాల్గొంటాయి. ఇటీవల అన్యమతస్తులు కొందరు తమ గ్రామంలో హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండడంతోనే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇతర మతాలవారు ఎవరైనా వచ్చి మత ప్రచారానికి, మతమార్పిడులకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.