
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. కొన్ని పార్టీలు వీటిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని కొందరు నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ముంబైలో నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్ సదస్సులో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి సీఏఏను ఉపయోగించుకోవాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ పౌరసత్వం కల్పిస్తుందని.. ఈ విషయంలో మోదీ సర్కారు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మూడు దేశాల మైనారిటీ ప్రజలు భారత్ లోకి వచ్చారు.. వారివద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేవు. ఏళ్ల తరబడి వారు ఆయా దేశాల్లో నరకాన్ని అనుభవించారు. వారికి పౌరసత్వం ఈ బిల్లు ద్వారా దొరుకుతుందని ఆయన అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల్లో ఉండిపోయిన మైనారిటీలకు మిగతా పౌరులతో సమానంగా హక్కులు కల్పించాలని పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ లలో ఇది జరుగలేదన్నారు. ఆ దేశాలు ఇస్లాం దేశాలుగా ప్రకటించుకున్నాక అక్కడ మిగిలిపోయిన మైనారిటీలు భయంకరమైన హింసను ఎదుర్కొన్నారని ఎవరైతే భారత్ లోకి వచ్చారో వారి బాగు కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని ఆయన తేల్చి చెప్పారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





