News

పౌరసత్వ చట్టంపై సెమినార్ నిర్వహించినందుకు కేరళలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ గూండాల దాడి

1.5kviews

పౌరసత్వ సవరణ చట్టం 2019 కు మద్దతు ఇచ్చినందుకు త్రిశూర్‌లోని కేరళ వర్మ కళాశాలలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ, గూండాలు దారుణంగా దాడి చేశారు.

ఈ ఇస్లామో-వామపక్ష గూండాలు ABVP విద్యార్థులను తరగతి గది నుండి బయటకు లాగి మరీ వారిపై దాడి చేశారు. కొందరు ఉపాధ్యాయుల జోక్యంతో సదరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దాడిలో అక్షయ్, అరోమల్, రాహుల్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. హింసాత్మక దాడి వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొత్త పౌరసత్వ చట్టం యొక్క ఉద్దేశ్యాలు మరియు ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మరియు వామపక్ష-ఇస్లామిస్ట్ సమూహాల హానికరమైన ప్రచారాన్ని బహిర్గతం చేయడానికి ఎబివిపి ప్రారంభించిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచారంలో భాగంగా క్యాంపస్లో సెమినార్ నిర్వహించబడింది.

ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఆయుధాలు చేత బూనిన కొందరు ఎస్‌ఎఫ్‌ఐ గూండాలు ఎబివిపి కార్యకర్తలను బెదిరించడమే కాకుండా అలాంటి చర్యలకు దూరంగా ఉండమని హెచ్చరించారు. సెమినార్ ముఖ్య అతిథిని క్యాంపస్‌లోకి అనుమతించడానికి కూడా వామపక్ష గూండాలు అనుమతించలేదు. రాష్ట్రంలోని ఇతర వామపక్ష అడ్డాలలో మాదిరిగానే కేరళ వర్మ క్యాంపస్‌లో కూడా ఎస్‌ఎఫ్‌ఐ మినహా మరే ఇతర విద్యార్థి సంస్థలు పనిచేయడానికి అనుమతి లేదు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.