News

శాంతి భద్రతలకు విఘాతం కలుగనివ్వకండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన

578views

పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు పంపింది. ముఖ్యంగా హింసను ప్రేరేపించే విధంగా అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపైనా, సోషల్‌మీడియా పోస్టులు చేసేవారిపైనా చర్యలు తీసుకోవాలంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు సూచించింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.