News

డాక్టర్ ముండ్రా జనార్దన రావు ఆకస్మిక మృతి

601views

నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ RMO డాక్టర్ ముండ్రా జనార్ధన రావు ఆకస్మికంగా మృతి చెందారు.ఈ ఉదయం (16-12-19) వారి రూంలో శ్రీ జనార్ధన్ రావు  స్పృహలో లేని స్థితిలో కనిపించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు విగతజీవి అయినట్లుగా తేల్చారు. దాంతో ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనను వెలువరించాయి.

డాక్టర్ జనార్ధనరావు కాకినాడలో తన MBBS పూర్తికాగానే RSS లో ప్రచారక్ గా చేరారు. వనవాసీ కల్యాణాశ్రమంలో బాధ్యత తీసుకుని, అరకు ప్రాంతంలో క్లిష్టమయిన అడవుల్లో గిరిజనులకు సేవలు అందించారు. RSS లో విజయనగరం, విశాఖ, నెల్లూరు, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో దేశాకార్యంకోసం జీవితాన్ని సమర్పించారు.

ఆ తర్వాత ప్రచారక్ వ్యవస్థ నుండి బయటకువచ్చినా, బ్రహ్మచారిగానే వుంటూ భారతమాతసేవలో నిరంతరం పనిచేశారు. ఆ తర్వాత MD విద్య పూర్తిచేసి, కామినేని హాస్పిటల్ గ్రూప్ లో RMOగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ వైభవం కోసం తనజీవితాన్ని సర్వం సమర్పణ చేసిన ఆ మహామనీషి అకాలమరణం పట్ల అనేకమంది సీనియర్ కార్యకర్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.