
ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టులపై ముస్లిం మూక దాడి చేసింది. సీమాపురి బెంగాలీ బస్తీ సమీపంలోని అక్రమంగా నివసిస్తున్న వారిపై, అక్రమ ఆక్రమణలపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన సమయంలోనే ముస్లిం మూక చుట్టుముట్టి మరీ దాడికి దిగింది. ఈ దాడిలో ఆల్ ఇండియా న్యూస్ రిపోర్టర్ సుప్రియా పాఠక్ మరియు కెమెరామెన్ శ్యామ్ తీవ్రంగా గాయపడ్డారు. సుప్రియా పాఠక్ కాలు విరిగిపోయింది. అంతేకాకుండా దాడి చేసిన ముస్లిం గుంపు కెమెరామెన్ శ్యామ్ చేతిలోంచి కెమెరా, మైక్ తీసుకొని పారిపోయారు. అయితే దాడి జరిగిన ప్రాంతంలోకి ఏ పోలీసు అధికారి కూడా ప్రవేశించడానికి ధైర్యం చేయడన్న వాదనలూ వున్నాయి. ఇంత మూక దాడి జరిగి, జర్నలిస్టులు తీవ్రంగా గాయాలపాలైనా… ఎడిటర్స్ గిల్డ్ నుంచి ఇంకా స్పందనే రాకపోవడం శోచనీయం. మానవత్వం గురించి ప్రతిరోజూ వల్లెవేసే ముస్లిం జర్నలిస్టులు కూడా ఈ ఘటనపై మౌనంగానే వుండిపోయారు.
మరోవైపు అసలు చాలా ఘోరంగా తమపై ముస్లిం గుంపు దాడికి దిగిందని, దానిని మరచిపోలేకపోతున్నామని సుప్రియా మీడియాతో వాపోయింది. దేశ రాజధాని నడిబొడ్డున ఇంతటి ఘోరదాడి జరగడం ఆశ్చర్యంగా వుందని పేర్కొన్నారు.ఈ బెంగాలీ బస్తీలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని, బంగ్లాదేశీయులు కూడా అక్రమంగా నివసిస్తున్నారని స్థానికులు కూడా తమతో చెప్పారని దానిని కవర్ చేయడానికే తాము ఆ ప్రాంతానికి వెళ్లామని పేర్కొంది.
ఆ ప్రాంతానికి వెళ్లగానే ఓ యువకుడు తన జుట్టుపట్టుకొని లాగాడని, దీంతో తామిద్దరమూ ప్రతిఘటించామని, దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారని నిలదీశామని తెలిపింది. అంతలోనే వెనుక నుంచి ఎవరో ఆ కెమెరాను లాక్కోండంటూ అరవిడం తాము విన్నామని, కెమెరాను జాగ్రత్తగా చూసుకుంటున్న సమయంలోనే దాడి ప్రారంభమైపోయిందని పేర్కొంది. తమను కాపాడడానికి వచ్చిన వారిని కూడా మారణాయుధాలతో వారు బెదిరించారని, కెమెరామన్ శ్యామ్ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా వుందని వాపోయింది. పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వున్నారని, ఇంత జరిగినా ఆ ప్రాంతంలోకి వెళ్లడం కూడా లేదని మండిపడింది.





