NewsProgrammsSeva

రేపటి నుండి‘సేవా సంగమం’

502views

నెల (డిసెంబర్ 2019) 7, 8తారీఖులలో (శని, ఆదివారాలలో) విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సాయి కిశోర్ మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సేవా భారతి రాష్ట్ర మరియు అఖిలభారత స్థాయిలలో “ సేవా సంగమం” (స్వచ్ఛంద సేవా సంస్థల సమ్మేళనము) నిర్వహించుకుంటూ ఉన్నదని తెలిపారు.  సమాజంలోని అనేకమంది వ్యక్తులు, సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వారందరినీ ఒక చోట కలిపి వారి అనుభవాలను పంచుకుని, వారితో కలిసి సంస్థ యొక్క సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదమూడు వందల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవాభారతి అనుభవాలను వారికి వివరించి మార్గదర్శనం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని శ్రీ సాయి కిశోర్ వెల్లడించారు.

అలాగే సేవా భారతి మరియు ఇతర సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించే విధంగా వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధార్థ కళాశాల వద్ద చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి రాష్ట్రమంతటి నుంచి అనేకమంది తరలిరానున్నారు.   

ఈ సమావేశంలో ఆర్. ఎస్. ఎస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు, ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు, సేవా సంగమం స్వాగత సమితి కార్యదర్శి డాక్టర్ పి. ఎస్. రావు,  సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండెపి హనుమంతరావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి పత్తి నాగలక్ష్మిలు కూడా పాల్గొన్నారు.  

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.