
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. ”యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ”శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో 10 టీమ్‌లు ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. ఈకేసులో ఏ1 నిందితుడు మహమ్మద్ అలియాస్ ఆరిఫ్ (26) లారీ డ్రైవర్, నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్ మండలం జక్కులూరు. ఏ2 నిందితుడు శివ (20) లారీ క్లీనర్, మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం. ఏ3 నవీన్(20) లారీ క్లీనర్ గుడిగండ్ల, ఏ4 చెన్నకేశవులు లారీ క్లీనర్ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారు.
28వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు యువతి తన ఇంటి నుంచి బయలుదేరింది. 6.08కి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. 6.15కి వాహనం నిలిపి అక్కడి నుంచి బయలుదేరింది. టోల్ ప్లాజా సమీపంలో ద్విచక్రవాహనం పార్కు చేయడం నిందితులు చూశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలని అప్పుడే చర్చించుకున్నారు. వారిలో నవీన్ … ద్విచక్రవాహనం బ్యాక్ టైరు గాలితీస్తే ఆమె ఆగిపోతుందని ఐడియా ఇచ్చాడు. యువతి రాత్రి 9.23 గంటలకు ప్రాంతంలో బైక్ వద్దకు రాగానే ఆరిఫ్ వెళ్లి మీ వాహనానికి పంక్చర్ అయింది సాయం చేస్తామని నమ్మించాడు. దీంతో వారికి 9.28కి బైక్ అప్పగించింది. 9.30 వరకు రాలేదు. ఏ2 శివ తిరిగి వచ్చి పంక్చర్ షాపు క్లోజ్ అయిందని చెప్పి మరో చోటకు వెళ్లాడు. ఏ3, ఏ4 ఇద్దరూ ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆతర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈక్రమంలో ముక్కు, నోరు మూసేయడంతో ఊపిరిఆడక ఆమె చనిపోయింది. 10.28 గంటలకు ఆమె బైక్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. 10.33 గంటలకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకుని బయల్దేరారు. రాత్రి 2 నుంచి 2.30గంటల మధ్యలో యువతి మృతదేహాన్ని చటాన్‌పల్లి సమీపంలో వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతదేహం కాలిందో లేదోనని కొంత సేపటి తరువాత మళ్లీ వచ్చి చూసి వెళ్లారు. పూర్తిగా కాలిపోయింది అనుకున్న తర్వాతే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు 11.25 గంటలకు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. “సీసీ కెమెరా దృశ్యాల సాయంతో నిందితులందరినీ అరెస్టు చేశాం. ఈకేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి, త్వరలోనే నిందితులకు శిక్ష పడేలా చూస్తాం” అని సీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





