ArticlesNews

‘ప్రేమ’గా జీహాద్ కోరల్లోకి… ‘లవ్’ జీహాద్

1.1kviews

ప్రేమ పేరుతో ఇస్లాం మతమార్పిడికి పాల్పడే లవ్ జిహాద్ దాష్టీకాలు ఇంకా చాలా చోట్ల చోటుచేసుకుంటూనే ఉన్నాయి. హిందూ అమ్మాయిలను వలలో వేసుకుని నానా హింసలకు గురి చేస్తున్న అనేక సంఘటనల్లో కొన్ని బయట పడుతున్నాయి. మరికొన్ని గోప్యంగా ఉండిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు తన దృష్టికి వస్తూఉంటాయని వాటి పట్ల అందరికి అవగాహన ఉండాలని ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త రాఠీ హెగ్డే లవ్ జిహాద్  కుయుక్తుల గురించి వివరించారు.

– మా వద్దకు వచ్చే ప్రతి అయిదు కేసుల్లో ఒకరు దిగువ కులాలకు చెందిన వారే.

– వయసుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు ‘జిహాద్’ వలలో చిక్కుకుంటున్నారు. ఇద్దరు 14, 16 ఏళ్ల పిల్లలున్న వితంతువు కూడా ఈ ఉచ్చులో పడ్డారు.

– దాదాపు అన్ని కేసుల్లోనూ ముస్లిం యువకుడు అమ్మాయిని  బైక్ రైడ్ కి తీసుకెళ్లి ‘స్వేచ్ఛ’ అంటే ఇదే అని బోధలు చేయడంతో ప్రారంభం అవుతుంది.

– అమ్మాయిలను ఆకర్షించే మార్గాలను ముందుగా ముస్లిం అబ్బాయిలకు శిక్షణ కూడా ఇస్తారు. అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా కూడా ఆకర్షించే విద్యలన్నీ ముందుగా తెలుసుకుంటారు.

– స్నేహపూర్వక ఆలింగనం, చేతులు కలుపుకోవడంతో ప్రారంభిస్తారు ముస్లిం అబ్బాయిలు.  శరీర భాగాలను స్పృశిస్తూ, ‘పొరపాటు’న జరిగింది అంటూ మాట మారుస్తూ చాలా ముందుకు వెళ్తారు.

– 10, 12వ తరగతులకు చెందిన యువతులు బాగా ఒత్తిళ్లు ఉండే క్షణాలు, వారి హావభావాలను చూసి ముద్దులు పెట్టే వరకు చొరవ తీసుకుంటారు. గోప్యంగా  ఆ చేష్టలను  వీడియోలుగా తీస్తారు.

– ఇంత జరుగుతున్నా చాల మంది తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసే సరికి అవ్వాల్సిందంతా అయిపోతుంది.

– ఈ సంబంధాల నుండి బయటకు రమ్మని తల్లిదండ్రులు ఒత్తిళ్లు తెస్తే యువతులను ఇంట్లో నుండి బయటకు వచ్చేలా చేస్తారు ముస్లిం యువకులు. అదీ కాకపోతే చివరిగా వీడియోలు చూపెట్టి భయపెట్టి యువతులను తమ ఆధీనంలో ఉంచుకుంటారు. అప్పటికి కానీ తెలియదు ఆ అమ్మాయిలకు ఇవన్నీ వీడియోలో ఉన్నాయని.

– ఒకవేళ అమ్మాయి ఆ అబ్బాయి నుండి విడిపోవడానికి గట్టిగా నిశ్చయానికి వచ్చినా, యువకుడు తమ స్నేహితుల సహాయంతోనూ ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే ప్రతి సారీ ఆ అబ్బాయి..  ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననే చెబుతుంటాడు.

– అమ్మాయి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి గురించి పెద్దగా ఒత్తిడి తేక పోయినా ఆ తర్వాత అమ్మాయిని మానసికంగా తెలియకుండా తీవ్ర ఒత్తిడికి గురిచేసి తాను చెప్పే విధంగా మసలు కొనేలా చేస్తాడు.

– సరిగ్గా ఈ బలహీన సమయంలోనే పెళ్లిళ్లు జరిగే సందర్భాలు ఎక్కువ. పెళ్లి చేసుకున్నాక అమ్మాయి మతమార్పిడి జరుగుతుంది. 6 నెలల వరకు అంతా సాఫీగానే సాగిపోతుంది. అసలు వేధింపు అప్పుడు ప్రారంభం అవుతుంది. మొదట కొడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా వేధింపులు ఎక్కువవుతాయి.  గర్భవతిని చేయడం అబార్షన్ చేయించడం ఇలా పదే పదే చేస్తాడు.

– ఈ సంబంధం ఇలా కొనసాగిస్తూనే మరో రెండేళ్లకు ఆ ముస్లిం వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.

– ఇంకా జుగుప్సాకరం ఏమిటంటే రెండో పెళ్లి వ్యతిరేకించే మొదటి అమ్మాయి మరీ ఎదురు తిరిగితే భర్త తండ్రి, సోదరులే ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించిన నీచమైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో  అత్త, ఆడపడుచులు రోజు చిత్రహింసలకు గురి చేస్తారు.

– ఒకవేళ మాట్లాడుకునే పరిస్థితి ఉంటె పోలీసులు, ఆ ఇంట్లో వారి సమీప బంధువులు ఆ అమ్మాయిని సర్దుకుపొమ్మని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

– అమ్మాయి ఇంకా గట్టిగా వారందరిని వ్యతిరేకిస్తే, మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు ఆ ఇంట్లో వారు.

– చివరికి ఆ అమ్మాయి ఇంట్లో నుండి ఎలాగో ఒకలా బయట పడితే పిల్లల్ని మాత్రం అమ్మాయికి దక్కనివ్వరు. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే, ఒక బిడ్డని మాత్రమే అమ్మాయి కస్టడీకి ఇస్తారు.

– ఒక వేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అమ్మాయి న్యాయం పొందినా భరణం మాత్రం చెల్లించకుండా అబ్బాయి తప్పించుకుంటాడు. వీరిది చాలా అనైతికమైన వివాహ బంధం. పెళ్లి జరిగిన తర్వాత అమ్మాయి మతమార్పిడి జరుగుతుంది కాబట్టి తన ఆస్తిపై ఎటువంటి హక్కు ఆమెకు ఉండదని మూర్ఖంగా ఆ హిందూ మహిళను రోడ్డున పడేలా చేస్తారు.

తస్మాత్ జాగ్రత్త … లవ్ జిహాద్  పేరుతో జరిగే ఇటువంటి ఆగడాలు అందరికీ తెలియాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి ….

ఆంగ్ల మూలం : RATI HEGDE

తెలుగు అనువాదం : శ్రీమతి రేఖ, విజయవాడ.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.