ArticlesNews

కంచి పీఠంలో సత్య చంద్రశేఖరేంద్ర శంకరాచార్య స్వామిజీ సన్యాస దీక్ష

585views

కంచి కామకోటి పీఠం పరంపరలో భాగంగా తదుపరి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో సత్య చంద్రశేఖరేంద్ర శంకరాచార్య స్వామిజీ సన్యాస దీక్షను స్వీకరించారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కంచిపీఠం పరంపరలో భాగంగా బాధ్యతలు స్వీకరించేందుకు స్వామిజీకి సన్యాస దీక్షను స్వీకరించారు. కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిజీ పేరును అధికారికంగా ప్రకటించారు.

కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ను కొద్ది రోజుల క్రితం ఎంపికయ్యారు. గత వారం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారసుడిపై ప్రకటన చేశారు. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సన్యాస దీక్ష ప్రసాదించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.

కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో సన్యాస దీక్ష ధారణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామాక్షి అమ్మవారి ఆలయం నుంచి శ్రీ మఠానికి ఊరేగింపు నిర్వహించారు. శ్రీమఠంలోని శ్రీ మహా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

కాంచి పీఠంలోని శంకరాచార్య, సురేశ్వరాచార్య సన్నిధిలో పూజలు చేసి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి బృందావనాలను దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో సన్యాస దీక్షను ప్రసాదించారు.

కంచి పీఠంలో సన్యాస దీక్షను స్వీకరించిన సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిజీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్షను ప్రసాదించారు.

2006లో వేద అధ్యయన దీక్ష…
ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు. ఈయన కొన్ని రోజులు తెలంగాణ బాసరలో సేవలందించారు.గణేశ శర్మ తండ్రి అన్నవరం ఆలయంలో పురోహితుడిగా ఉన్నారు. గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్ష తీసుకున్నారు.కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశశర్మకు అరుదైన గౌరవం దక్కటంపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

2018లో జయేంద్ర సరస్వతి మహాసమాధి కావటంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచే ఆయనే కొనసాగుతూ వచ్చారు. గత ఆరేండ్లుగా ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతుండగా…. తాజాగా గణేశశర్మను ఎంపిక చేస్తూ ప్రకటన విడుదలైంది.

కంచి కామకోటి మఠాన్ని ఆది శంకర స్థాపించారు, తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది. ఆది శంకర భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో శాంతి, ప్రశాంతత యొక్క శోధన కోసం ఇక్కడకు వస్తుంటారు.