News

సంభల్ లో ఆ బావి మసీదుకు వెలుపల ఉంది

281views

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో మొగలుల కాలంలో నిర్మించిన జామా మసీదు ఎదుటనున్న వివాదగ్రస్తమైన బావి మసీదు స్థలంలో లేదని, అది పూర్తిగా మసీదుకు వెలుపల ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. మసీదుకు సమీపంలో ఒక పోలీసు చౌకీని దాటిన తరవాత ఈ బావి వస్తుందని, అది పూర్తిగా మసీదుకు వెలుపల ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె. ఎం. నటరాజ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు తెలిపారు. జామా మసీదు నిర్వహణ కమిటీ దీనిపై రెండు వారాల్లో సమాధానాన్ని ఇవ్వాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. మసీదు కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ ప్రస్తుతం జైలులో ఉన్నారు కాబట్టి ఆయన్ను సంప్రదించి మూడు వారాల్లో సమాధానమిస్తామని మసీదు కమిటీ న్యాయవాది హుజేఫా అహ్మది కోర్టుకు తెలిపారు. అయితే రెండు వారాల్లోనే సమాధానం దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.