News

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

542views

త్తర కశ్మీర్‌లోని బందిపొరా సెక్టార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమవ్వగా.. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.