
ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి చేయాలని వక్తలు ప్రబోధించారు. గురునానక్, వివేకనంద, అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, మహాత్మాగాంధీ, వెన్నెలకంటి రాఘవయ్య, పొనకా కనకమ్మ తదితరుల జయంతులు నిర్వహించాలని ప్రబోధించారు. 41మంది పాల్గొన్న ఈ కార్యశాలలో ప్రముఖ రచయిత డాక్టర్ వడ్డి విజయసారధి, Rss సహ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య, సమరసతా కార్యదర్శులు శ్రీ కోడూరుసత్యం, శ్రీ నరసింగరావు నాయుడు, శ్రీ రఘురాం, SSF రాష్ట్ర కార్యాధ్యక్షులు శ్రీ విష్ణు, శ్రీ శ్యామ్ మోహనరావు, తదితరులు మార్గదర్శనం చేశారు.




మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





