News

కడపలో ఆది జాంబవ పరియోజన సమావేశం

365views

ఆది జాంబవ పరియోజన సమావేశం ఏప్రిల్ 9న కదవ జిల్లా, బ్రహ్మంగారిమఠంలో ఏపి టూరిజం విశ్రాంతి భవనంలో జరిగింది. భారత మాతకు పూలమాల అలంకరణ తర్వాత, బాబుజగజ్జీవనరామ్ జీవితం పై ఒక చిన్న పుస్తకం, ఉగాది నుండి ఉగాది వరకు కేలండర్ ఆవిష్కరణ జరిగింది.

స్వామి విరజానంద వారి ఆశీఃప్రసంగం చేస్తూ “జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో ఆదిజాంబవ సమావేశం జరుపు కుంటున్నాము. ఆనాడే “మతం నీతిరా, కులం మాదిగరా? అని శిష్యుడు కక్కయ్యతో చెప్పించారు. అదే ఈ ఆదిజాంబిన కుల ప్రత్యేకత హిందూ సమాజం కులరీత్యా ఏనాడూ హెచ్చు తగ్గులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాలక్రమంలో పొలంలో కలుపులాగా, ఇంట్లో దుమ్ములాగ, వంటికి పట్టే మలినంలాగా ఈ హెచ్చుతగ్గులు, అంటరానితనం, అస్పృశ్యత వచ్చాయి. వీటిని ఎప్పటికపుడు తీసివేయాలి, శుభ్రంచేయాలి. ఆ పనినే నేడు సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్నది. మనమందరం హిందూ ధర్మపరిరక్షణలో భాగస్వాములు అవుదాం. ధర్మాన్ని ఆచరిద్దాం. ధర్మాన్ని కాపాడుకుందాం” అని అన్నారు.

దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న మాట్లాడుతూ ఈ దేశంలో హిందువులకు జరిగిన నష్టం, హిందువులను మతం మార్చిన తీరు. అందుకు హిందువులు చేసిన ప్రాణ త్యాగాలు మరిచిపోలేని సంఘటనలు అని తెలుపుతూ, అది జాంబన పరియోజన పని గూర్చి వివరాలు తలియచేసారు.

వంశ తిలక్ మాట్లాడుతూ అది జాంబవ కులాన్ని కాపాడుకోవడం భారతీయ ధర్మమని, దేశంలో మతకల్లోలం జరిగినప్పుడు ఆదిజాంబవులే ప్రాణాలను ఎదురొడ్డి నిలిచారు అని తెలిపారు. అది జాంబవులలో మత మార్పిడి తగ్గాలి అంటే ప్రతీ ఆదివారం ఆది జాంబవ పూణ ప్రతీ ఇంట్లో జరిగేలా చూడాలి. అని చెప్పారు.

ఈ సమావేశంలో ప్రాంత ఎస్ఎస్ఎఫ్ సంయోజక్ కొండారెడ్డి. సహ సంయోజక్ తులసిసూర్యప్రకాశ్లతో పాటు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం విభాగ్ లోని 9 జిల్లాల నుండి జిల్లా ధర్మప్రచారకులు, 3 జిల్లాల పరియోజన ప్రముఖులు, 2 జిల్లాల నుంచి జిల్లా కన్వీనర్లు, సహ కన్వీనర్లు మొత్తం 105 మంది పాల్గొన్నారు.