News

ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్

319views

కేంద్ర వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ‌ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ నేపాల్‌లోని ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ప‌శుప‌తినాథ్‌ను ద‌ర్శించుకున్నారు. బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో స‌మావేశం అవుతున్నారు. ఆ స‌మావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయ‌న ప‌శుప‌తినాథుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ప‌శుప‌తినాథ్ ఆల‌య విజిట్‌కు చెందిన వీడియోను పోస్టు చేశాడు.

ఆల‌య ఆవ‌ర‌ణ‌లో రుద్రాక్ష‌, హ‌ర్‌సింగార్ మొక్క‌ల‌ను కేంద్ర మంత్రి నాటారు. కుటుంబంతో క‌లిసి ప‌శుప‌తినాథుడికి పూజ‌లు చేశాన‌ని, దీన్ని అదృష్టంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో చెప్పారు. ప‌శుప‌తినాథుడి పూజ త‌న‌కు కొత్త ఉత్తేజాన్ని, ప్రేర‌ణ‌ను ఇస్తుంద‌న్నారు.