News

అనంతపురంలో విశ్వహిందూ పరిషత్ శోభాయాత్ర

369views

శ్రీ రాముడు మానవాళికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం శ్రీరామ నవమి పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ రథయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్ర అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల నుండి ప్రారంభమై నగరంలో వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నేతృత్వంలో దేశంలో రామరాజ్య పాలన జరుగుతోందని అన్నారు. అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడికి కోట్లల్లో భక్తులున్నారని అన్నారు. శ్రీరాముడి ధర్మ రక్షణకు, ధర్మ పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.