News

జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం

335views

ఎందరో అభాగ్యులు, అనాథలకు ఆశ్రయమిస్తూ ఆకలి తీరుస్తున్న వైఎస్సార్‌ జిల్లాలోని జ్యోతి క్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని వేలాది అభాగ్యులకు ఆపన్నహస్తంగా మారిన ఆశ్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరికాదన్నారు. జ్యోతి క్షేత్రాన్ని ఒక అనాథల నిలయంగా, సామాజికసేవా ఆలయంగా, అభాగ్యుల పాలిట ఆపన్నహస్తంగా చూసి అనుమతులు ఇవ్వాలన్నారు. అటవీ అధికారులు కూలగొట్టిన భవనాలను నిర్మించడమేగాక, ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇప్పించి ప్రభుత్వ పెద్దలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా ఏ క్షేత్రంపై లేని వివక్ష జ్యోతిక్షేత్రంపై మాత్రమే ఎందుకు చూపుతుందో అర్థం కావడం లేదన్నారు.