News

వెలుగులోకి కులోత్తుంగ చోళ శాసనం

446views

వైయస్సార్ జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామసమీపంలో ఓ బండరాయిపై కులోత్తుంగ చోళ రాజులకు సంబంధించిన శాసనం వెలుగు చూసిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. చోళ రాజు కులోత్తుంగ పాలనలో మహారాజవాడి ప్రాంతంలోని మురలూరు గ్రామాన్ని స్థానికంగా ఉన్న ఓ వైశ్యపెద్దకు దానం చేసినట్లు శాసనంలో పేర్కొన్నారన్నారు. రాజు సామంతులైన అధిరాజేంద్ర-వైదుంబమహారాజన్‌ల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరిగినట్లు అందులో ఉందని ఆయన వెల్లడించారు. ఈ శాసనం మొత్తం తమిళ భాషలో రాసి ఉండటాన్ని చిత్రంలో చూడొచ్చు.