
ప్రయాగ్ రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళ యాత్రికులతో కిక్కిరిసిపోయింది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ మహా కుంభమేళలో అమృత స్నానాన్ని చేసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాగిన ఈ మహా కుంభమేళ.. జనసంద్రంగా మారింది. ఈ కుంభమేళ ఇటీవల ముగియడంతో.. ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇక ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం ప్రాంతంతోపాటు పరిసర ప్రాంతాలను 15 రోజుల్లో శుభ్రం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దీనిని ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంచింది. అందులోభాగంగా యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తీసి వేస్తున్నారు. అలాగే సంగమం ఘాట్లు, రహదారులను శుభ్రం చేస్తున్నారు. ఇక యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మౌలిక సదుపాయాలను సైతం తొలగిస్తున్నారు. అదీకాక.. 45 రోజుల పాటు యాత్రికులతో జనసంద్రంగా మారిన ఆ ప్రాంతం ప్రస్తుతం అతి కొద్ది మంది యాత్రికులతో ఉంది.
ఆయన ఆధ్వర్యంలో..
ఇక ఈ ప్రాంతంలో పరిశుభ్ర పరిచే కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఆకాంక్ష రానా పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛతా మిత్రా, గంగా సేవా దుత్‌లో ఈ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలోని వ్యర్థాలను నైనీలోని నిర్వీర్యం చేసేందకు బస్వార్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మరోవైపు ఈ మహాకుంభమేళలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు 15 వేల పారిశుద్ధ్య పనివారితోపాటు 2 వేల గంగా సేవా దూత్‌లను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.





