
మహా శివరాత్రి పర్వదినం రోజున ఏ ఒక్క హిందువు మాంసాహారం తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న విద్యార్థులకు మాంసాహారం వడ్డించే ఎస్ఎఫ్ఐ విభాగం వారు ప్రయత్నం చేశారని ఏబీవీపీ విభాగం నేతలు తెలిపారు.
దీనిపై ప్రశ్నిచిన ఏబీవీపీ విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ నేతలు దాడికి దిగారని ఆరోపిస్తున్నారు. ఈ గొడవ మరింత తీవ్రత కావడంతో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ యూనివర్శిటీలో గొడవపై మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. యూనివర్శిటీలో విద్యార్థులు గొడవ పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాంసాహారం వడ్డించడంపై క్యాంటీన్‌తో తొలుత విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడం, ఆపై వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ గొడవలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
మహాశివరాత్రి రోజున మాంసాహారం వడ్డించకూడదన్న తమ ఆదేశాలను కట్టుబడకుండా కావాలనే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు తమపై దాడి చేశారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపించారు.





