ArticlesNews

శివాజీపై కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధుల దుష్ప్రచారం, వాస్తవాలేంటి?

370views

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. శివాజీ జయంతి కూడా రావడంతో సామాజిక మాధ్యమాల నిండా శివాజీ, శంభాజీ నామస్మరణ హోరెత్తిపోయింది. దాన్ని జీర్ణించుకోలేని కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధులు, ముస్లిములు తమ తప్పుడు ప్రచారాలను మరోసారి బైటకు తీసారు. శివాజీ శూద్రుడనీ, అందువల్ల అతడికి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు అంగీకరించలేదనీ ప్రచారం చేసారు. దానికి దీటుగా జాతీయవాదులు చారిత్రక వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. అసలీ దుష్ప్రచారం ఎలా మొదలైందో బైటపెట్టారు.

అన్నాదురై తమిళనాడులో ద్రవిడవాదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలనే దురుద్దేశంతో శివాజీ పేరిట తప్పుడు కట్టుకథనాలతో ఓ నాటకం వ్రాసాడు. పూర్తిస్థాయి బ్రాహ్మణద్వేషంతో వ్రాసిన ఆ నాటకానికి ఈవీ రామస్వామి నాయకర్ వంటివారు విస్తృత ప్రాచుర్యం కల్పించారు. ఆ నాటకంలో శివాజీగా నటించిన గణేశన్‌కు మంచి పేరు వచ్చింది. అతని పేరే “శివాజీ గణేశన్”గా మారిపోయింది. ఆ నాటకంలోని అసత్య కథనాలూ సత్యాలుగా చెలామణీ అయి స్థిరపడిపోయాయి. ఆ శివాజీ కథ అన్నాదురై, పెరియార్‌ల కల్పిత సృష్టి అయిన కులగజ్జి తప్ప వాస్తవం కాదు. నిజానికి, శివాజీ సమకాలీనుల రచనల్లో వాస్తవాలు నమోదయ్యాయి.

శివాజీకి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు అంగీకరించకపోతే, మరి పట్టాభిషేకం చేసిన గాగాభట్టు ఎవరు? బ్రాహ్మణుడు కాడా? శివాజీ వద్ద మంత్రులుగా పనిచేసి, శివాజీ కన్నా సామ్రాజ్యాన్ని మరింతగా రాజ్యవిస్తరణ చేసిన పేష్వాలు బ్రాహ్మణులు కారా? పేష్వాలు మరాఠా వంశానికి సేవ చేసారే కానీ, అధికారం మొత్తం తమ చేతిలోనే ఉన్నా ఆ రాజ్యాన్ని తమదిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదే? అసలు శివాజీ ఛత్రపతి కాకముందు, తనతో కలసి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సహకరించి యుద్ధాలను చేసిన మురార్బాజీ వంటి వారెందరో! వారు బ్రాహ్మణులు కారా?

అసలు శివాజీకి శస్త్రవిద్యలు చదువులు నేర్పిన గురువు దాదోజీ కొండదేవ్ బ్రాహ్మణుడు కాడా? అనేకమార్లు ఆపత్కాలాల్లో శివాజీకి జ్ఞానబోధ చేసి, తరుణోపాయాలు ఉపదేశించి, హిందూసామ్రాజ్య స్థాపన చేయమని ప్రోత్సహించి ప్రేరేపించిన సమర్థ రామదాస్, సంత్ తుకారాం బ్రాహ్మణులు కారా?

అంతెందుకు! పన్హాలా కోటను ఆదిల్‌షా సైన్యము ముట్టడించి శివాజీని చంపడానికి ప్రయత్నించినప్పుడు, శివాజీ వేషాన్ని వేసుకుని తానే దొరికిపోయి, చివరికి తన ప్రాణాలనే అర్పించి, మారువేషం వేసి శివాజీని తప్పించి కాపాడిన బాజీప్రభు దేశ్‌పాండే బ్రాహ్మణుడుకాడా?

తనకు ఇంత చేసిన బ్రాహ్మణుల పైన శివాజీకి ద్వేషము ఎందుకు ఉంటుంది? ఉన్నట్టుగా ఆయన ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు తన ఆస్థానంలో ముఖ్యమైన పదవులన్నీ బ్రాహ్మణులకి ఇవ్వడమే కాకుండా, అనేక సమయాల్లో సంపూర్ణ రాజ్య పరిపాలనా భారాన్ని కూడా పేష్వాల పైనే విడిచిపెట్టిన ఉదంతాలు మరాఠా చరిత్రలో అనేకం ఉన్నాయి.

మరి శివాజీ పట్టాభిషేకానికి బ్రాహ్మణులు ఒప్పుకోలేదన్న దుష్ప్రచారం ఎందుకు, ఎలా మొదలైంది? దానికి కారణాలేమీ లేవా? అంటే కొన్ని కారణాలు లేకపోలేదు. వాటిని వక్రీకరించి వామపక్షులు, ఉదారవ్యాధులు తప్పుడు ప్రచారం చేసారు. అది ఎలా జరిగిందో చూద్దాం.

శివాజి పట్టాభిషేకానికి కొంతమంది అభ్యంతరాలు తెలిపిన మాట పాక్షికంగా నిజమే. ఆ అభ్యంతరాలను వ్యక్తం చేసిన వారు బ్రాహ్మణులు మాత్రమే కారు. కొందరు చిన్నచిన్న జాగీర్దారులు తమ తోటి జాగీర్దారైన శివాజీని నాయకుడుగా, అసూయతో అంగీకరించలేకపోయారు. శివాజీ ఛత్రపతి అయితే జాగీర్దారులందరూ తమ సైన్యాలను, అశ్వదళాలనూ శివాజీకి అప్పగించాలి. దాంతో తమ అధికారాలకు కోతపడుతుందని మరికొందరు వ్యతిరేకించారు. శివాజీకి పన్నులు కట్టాల్సి వస్తుందని కొందరు వైశ్యులు నిరాకరించారు.

అంతే కాదు. శివాజీ కొందరు ముస్లిములను ఉన్నత స్థానాల్లో నియమించడాన్ని కొందరు జాగీర్దారులు ఒప్పుకోలేకపోయారు. ఆయన సైన్యంలో నూర్‌ఖాన్ బేగ్ వంటి ముస్లిములు కీలక స్థానాల్లో ఉండడంతో, శివాజీ హిందువులకు ఛత్రపతిగా ఉండడానికి అనర్హుడని భావించి వ్యతిరేకించారు.

అసలు శివాజీ శూద్రుడా, క్షత్రియుడా అన్న చర్చలోనే అర్థం లేదు. శివాజీ తండ్రి శహాజీ భోన్సలే ఆదిల్‌షా క్రింద జాగీరుదారు, అంటేనే ఒక చిన్న సామంతరాజు. వారికి సొంత సైన్యాలు కూడా ఉండేవి. అంటే వంశ పారంపర్యంగా శివాజీ కూడా రాజే. వారి ఆస్థానంలోనూ బ్రాహ్మణులు ఉండేవారు, వారు చెప్పిన పనులన్నీ చేసేవారు. అంటే జాగీరుదారుకి పట్టాభిషేకాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇక పట్టాభిషేకాన్ని వ్యతిరేకించే ప్రసక్తి ఎక్కడిది? కానీ ఒక సామ్రాట్టుకు చేసే “ఐంద్రాభిషేక విధానము” ఆ బ్రాహ్మణులకు తెలియదు. వారికి చేసే అవకాశము కూడా రాలేదు. ఎందుకంటే అంతకుముందు మూడు నాలుగు వందల సంవత్సరాలకు పైగా మహారాష్ట్ర ప్రాంతములో హిందూ చక్రవర్తులే లేరు. కనుక తమకు ఐంద్రాభిషేకం చేసే విధానము తెలియదు, ఆ సామర్ధ్యం లేదు అని విన్నవించుకున్నారు. అది అసలు విషయం. అంతే కానీ తన సొంత ఆస్థానంలో పనిచేసే బ్రాహ్మణులు ఎదురు తిరిగారని, దానికోసమే శివాజీ కాశీ నుంచి గాగాభట్టును తెచ్చుకున్నాడనీ అబద్ధాల కథనాలు అల్లేసారు. అంతే తప్ప దానికి సమకాలీన వ్యాఖ్యలు, ఆధారాలు ఏవీ చరిత్రలో ఎక్కడా లేవు.

ఎందరో సుల్తానులను ఎదిరించి పోరాడి, తప్పుచేసిన సొంత మేనమామనే శిక్షించి, అనేక యుద్ధాలలో ఎందరో బ్రాహ్మణులను సైతం చంపి, ఎవరికీ తల వంచడమే తెలియని శివాజీ, కొందరు సాధారణ బ్రాహ్మణులకు తలవంచాడు అనడం హాస్యాస్పదం. అది అసలు శివాజీ తత్వమే కాదు. ఇక్కడ కుల ప్రసక్తి తేవడానికి ఆస్కారమే లేదు.

నిజానికి శివాజీ గాగాభట్టును పిలిపించాడని కూడా చరిత్రలో ఎక్కడా లేదు. శ్రీ విశ్వేశ్వర గాగాభట్టే శివాజీ పట్టాభిషేకము గురించి విని, స్వయంగా వచ్చి, ఆశీర్వదించి శివాజీ క్షత్రియ మూలాలను కూడా తెలియజేసి, ఐంద్రాభిషేకం వంటి కార్యక్రమాలు జరిపించడానికి తన సమర్ధతను ప్రకటించాడు. శివాజీ “సభాసద్ ఫర్మానాలో” అలాగే వ్రాసి ఉంది. గాగాభట్టు తన “శివ రాజ్యాభిషేక ప్రయోగ” అనే గ్రంథంలోనూ ఆ విషయాన్నే చెప్పాడు. కనుక, అదే నిజం. అన్నాదొరై, రామస్వామి నాయకర్‌ ప్రచారంలో పెట్టిన కట్టుకథలన్నీ బ్రాహ్మణ వ్యతిరేక కుట్రలు అబద్ధాలు మాత్రమే అని తేలిపోయింది.

నిజానికి 1673 నుంచే శివాజీని ఛత్రపతి చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. 1674 మే 28న ప్రాయశ్చిత్త విధి నిర్వహించి, జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు, 1674 జూన్ 6న ఐంద్రాభిషేకము చేసి గాగాభాట్టు నేతృత్వంలో నాటి బ్రాహ్మణులు శివాజీని ఛత్రపతిగా ప్రకటించారు..

అయితే, పట్టాభిషేకమైన కొద్దిరోజులకే అంటే జూన్ 18 నాడే, శివాజీ తల్లి జిజాబాయి మరణించింది. పట్టాభిషేకం జరిగిన వెంటనే రాజసభలోని ఒక దూలం విరిగిపడి గాగాభట్టు ముక్కును గాయపరచిది. అలాగే రాణి సఖి కాశీబాయి, శివాజీ సేనాధిపతి ప్రతాప రావు కూడా వెంటవెంటనే మరణించారు. అందుకే, ముందు నుంచీ బ్రాహ్మణులలో కొందరు ఆ ముహుర్తము మంచిది కాదని నమ్మినవారూ ఉన్నారు. వారి వ్యతిరేకత శివాజీ కులాన్ని చూసి కాదు. ముహుర్తానికే మాత్రమే అన్నది నికార్సైన నిజం. అందుకే గాగాభట్టుతో పట్టాభిషేకము చేయించుకున్న కొద్ది రోజులకే శివాజీయే రెండవసారి మరో ముహూర్తం పెట్టించుకుని పట్టాభిషేకము చేయించుకున్నాడు. అలా 1674 సెప్టెంబరు 24న మరొకసారి నిశ్చలుడనే మరొక బ్రాహ్మణుడి చేత నిరాడంబరంగా పట్టాభిషిక్తుడయ్యాడు. మరి ఈ రెండవ పట్టాభిషేకము గురించి ఎవ్వరూ మాట్లాడరే? కేవలము శివాజీకి శూద్రుడు కనుక బ్రాహ్మణులు పట్టాభిషేకం చెయ్యటానికి నిరాకరించారని మాత్రమే దుష్ప్రచారమే చేస్తారే?

శివాజీ పట్టాభిషేకానికి దేశ విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సందర్భాలు చరిత్రకారుల రచనల్లో నమోదయ్యాయి.

వాసుదేవ్ సీతారామ్ బెంద్రే అనే చరిత్రకారుడు ఇలా వ్రాసారు… ‘‘మహారాజును స్నానాల గదికి తీసుకుని వెళ్ళారు. ఆయన మంత్రులందరూ ఆయనకు తొలుత క్షీరాభిషేకం చేసారు, తర్వాత జలాలతో అభిషేకించారు. క్షత్రియులలో మహావీరుడా, గొప్ప ఆధిపత్యం కలిగిన వాడా, జనార్దనుడి వంటి ఘనమైన వాడా, భారతదేశానికి చంద్రుని వంటి వాడా, మా బ్రాహ్మణులందరికీ మహారాజా, నీకు జయమగుగాక అని కీర్తించారు.’’

ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీ తమ ప్రతినిధిగా హెన్రీ ఆక్సెండెన్‌ను పంపించింది. అతను రాయగడ కోటలో సుమారు నెలరోజులు ఉన్నాడు. శివాజీ పట్టాభిషేకం అయేవరకూ అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఎలాంటి వివాదమూ జరిగినట్లుగా అతను ప్రస్తావించలేదు.

అయితే, శివాజీ పట్టాభిషేక మహోత్సవానికి ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు వచ్చి హాజరైనట్లు ఆక్సెండెన్ నమోదు చేసాడు.

అదీ, అసలు జరిగిన కథ. అన్నాదొరై, రామస్వామి నాయకర్ వంటి ద్రవిడవాద దుర్మార్గులు తమ కులగజ్జితో శివాజీ శూద్రుడనీ, అందుకే శివాజీకి ఎవరూ పట్టాభిషేకము చెయ్యటానికి ఒప్పుకోలేదనీ తప్పుడు రాతలు రాసారు, ప్రచారం చేసారు. అసలు శివాజీయే తాను క్షత్రియుడననీ, శిశోదయ (సిసోడియా) రాజవంశానికి చెందినవాడిననీ ప్రకటించుకున్నా, ఈ ద్రవిడవాదులు పట్టించుకోకుండా తమ కడుపుమంటతో లేనిపోని కులవిభేదాలను రెచ్చగొట్టారు.