News

పురాతన ఆలయ అభివృద్ధికి చర్యలు

OLYMPUS DIGITAL CAMERA
235views

విజయనగరం జిల్లా బలిజిపేటలోని 156 సంవత్సరాల కిందట నిర్మించిన పురాతన వేంకటేశ్వరాలయ అభివృద్ధికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర తెలిపారు. ఈ ఆలయంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆలయాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అర్చకులు హరి కృష్ణ మాచార్యులను,ఆలయ పరిధిలోని దేవుని ఆస్తులు, రాబడులు గురించి ట్రస్ట్‌ సభ్యులను అడిగితెలుసుకున్నారు.ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని సుం దరీకరణతో అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం ఎండోమెంట్‌ శాఖ ఇంజ నీరింగ్‌ అధికారులను పంపించి ఎస్టిమేట్లు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు శ్రీధర్‌, టీడీపీ మండలాధ్యక్షులు వేణుగోపాలనాయుడు, బీసీ సెల్‌ అధ్యక్షులు బి.రామ్మోహన్‌నాయుడు, పెద్ద పాపినాయుడు, గొట్టపు వెంకట నాయుడు పాల్గొన్నారు.