News

శివరాత్రికి పటిష్ఠ ఏర్పాట్లు

289views

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈనెల 25 నుంచి జరుగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. బారికేడ్లు, టెంట్లు వేయాలని, దర్శనాలు వేగవంతంగా పూర్తయ్యేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. 26న మహా శివరాత్రి రోజున ఆలయంలో జరిగే పూజలకు సంబంధించిన ఏర్పాట్లు, చక్రతీర్థ స్నానాలకు వెళ్లే మార్గాలను పరిశీలించారు. చక్రతీర్థ స్నానాలకు లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని, ఆమేరకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.