News

భారత రాజ్యాంగం మీ తండ్రిదా? ఒవైసీపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి

373views

వక్ఫ్ బిల్లు విషయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రారంభించారు. మసీదు కాదు కదా… తమకి సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేదే లేదంటూ పార్లమెంట్ లో బెదిరింపులకు దిగారు. దీనికి అంతే దీటుగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బదులిచ్చారు. లోక్ సభలో జీరో అవర్ లో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ పైనే ఏకంగా వేళ్లు చూపుతూ, బెదిరిస్తూ ఒవైసీ మాట్లాడటం ప్రారంభించారు. సవరణను గనక తీసుకొస్తే రాజ్యాంగంలోని 25,26,14 అధికరణలను ఉల్లంఘించినట్లేనని హెచ్చరించారు.అలాగే సామాజిక అస్థిరతను సృష్టిస్తుందని, దీనిని ముస్లిం సమాజం ఏకగ్రీవంగా తిరస్కరించిందన్నారు. మసీదును కాదు కదా… దర్గాకి సంబంధించిన ఇంచు భూమి కూడా ఇచ్చేదే లేదన్నారు. వక్ఫ్ తమకు ఆస్తి అని, ఆరాధన లాంటిదని అన్నారు.

దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా అదే స్థాయిలో జవాబిస్తూ ఒవైసీపై విరుచుకుపడ్డారు.భారత రాజ్యాంగం ఎవరి సొత్తూ కాదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం మీ తండ్రిది కాదంటూ విరుచుకుపడ్డారు.ఒవైసీ పూర్తిగా అపోహల్లో బతుకుతున్నారని, ఎవ్వరూ చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.