
ఆదిశంకరుల బోధనలను యువకులు అధ్యయనం చేయాలని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శృంగేరి జగ ద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 75 వర్ధంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో శంకర విజయం అంశంగా ఆధ్యాత్మికవేత్త సామ వేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న ప్రవచన ధార రెండవ రోజుకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ నేటి యువతరం ఆదిశంకరులు జీవితం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. వ్యాసమహర్షి భారతీయ సనాతన ధర్మానికి చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. శంక రులు ధర్మసంరక్షకు కన్యాకుమారి నుంచి హిమాలయాలు వరకు పాద యాత్ర చేసి నాలుగు పీఠాలను స్థాపించారన్నారు. శంకరులు ప్రస్తానయ త్రయ పారిజాతం అనే గ్రంథం రచించినట్లు తెలిపారు.
శంకర విజయం అంశంగా ప్రసంగిస్తున్న సామవేదం షణ్ముఖశర్మ అన్ని శాస్త్రాలకు నిలయం మహాశివుడు కొలువై వున్న కాశీ క్షేత్రం నిలయమని పేర్కొన్నారు. కార్య క్రమంలో ధర్మాధికారి హనుమత్ ప్రసాద్, పూర్వవు ధర్మాధికారి జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి పాల్గొ న్నారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం విద్యా ర్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.