
53views
దేశంలో రోజురోజుకీ చెట్లు లేక పర్యావరణానికి ముప్పువాటిళ్లుతుందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్టు కోల్‌కతాకు చెందిన పరిమల్ కాంజీ (65) అన్నారు. కోల్‌కతాలో 20రోజుల కిందట సైకిల్ యాత్ర ప్రారంభించిన ఈయన శ్రీకాకుళం జిల్లా కవిటి మండల పరిధి జాతీయ రహదారిలోని కొజ్జిరియా, జాడుపూడి వద్ద స్థానికులతో మాట్లాడారు. చెట్లు లేకపోవడంతో సకా లంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజల ను కోరారు. తన సైకిల్ యాత్ర కన్యాకుమారి వరకు కొనసాగుతుందని, ఈ క్రమంలో గ్రామాల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.