News

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు

55views

రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి ప్రీతికరమైన సూర్యారాధన నిర్వహించారు . తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థులతో సూర్యనమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు కరిబండి రామకృష్ణ విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి వాటి ప్రాధాన్యతను వివరించారు.ఈసందర్భంగా యోగా గురువు రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడిని ఆరాధించడం , సూర్యనమస్కారాలు చేయడం వల్ల విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. యోగా అనేది మనసు శరీరాన్ని సమన్వయం చేసే సాధన అన్నారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యక్రమాల సమన్వయాధికారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.