News

సరస్వతీ పూజ ప్రతిపాదన చేయడంతో హిందూ ఉపాధ్యాయుడిపై ముస్లింల దాడి

310views

మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వున్న బెంగాల్ లో హిందువులపై దౌర్జన్యాలు పెరిగాయి. హిందువులు తమ పండుగలను కూడా జరుపుకోలేని స్థాయికి అక్కడి పరిపాలన పడిపోయింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం హిందువులు తమ పండుగలు చేసుకోవచ్చు. నిత్యం రాజ్యాంగం, హక్కులు అంటూ వల్లించే మమతా బెనర్జీ… ఆచరణలో చూపడం లేదు. నదియా ప్రాంతంలో వసంత పంచమిని పురస్కరించుకొని ఓ పాఠశాలలో హిందూ ఉపాధ్యాయుడు సరస్వతీ పూజ చేయాలని ప్రతిపాదించాడు. ఈ సమయంలో ఇస్లామిక్ ఛాందసులు ఆ ఉపాధ్యాయురాలను తీవ్రంగా కొట్టారు.పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లా పరిధిలోని హరిన్ ఘాటా బ్లాక్ లోని దస్పోల్ దంగా ప్రాథమిక పాఠశాల’లో జరిగింది.ఈ పాఠశాలలో ఎక్కువగా ముస్లిం విద్యార్థులే వున్నారు.

హిందూ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. అయితే వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో సరస్వతీ పూజ చేయాలని ఉపాధ్యాయుడు ప్రతిపాదించారు.దీంతో ముస్లిం వర్గీయ ఉపాధ్యాయులకు విపరీతమైన కోపం వచ్చింది. స్థానికంగా వుండే ముస్లిం ఛాందసులు వెంటనే పాఠశాలలోకి వచ్చి, ఆ హిందూ ఉపాధ్యాయుడిపై దాడికి దిగారు. నానా దుర్భాషలాడారు.మిగతా వారు ఈ దాడిని ఆపాల్సింది పోయి, అలాగే చూస్తూ నిలబడ్డారు. మరోవైపు అలీముద్దీన్ అనే వ్యక్తి ఈ దాడిని ప్రేరేపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.