News

సనాతన వైదిక దేశమే లక్ష్యం

298views

భారత్‌ను సనాతన వైదిక దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ ఆదివారం ఇక్కడ ముగిసిన ధర్మ్‌ సంవాద్‌ సమావేశంలో తీర్మానించారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడ శ్రీపంచ దశాహ్నం జున అఖాడా ఆధ్వర్యంలో స్వామి నరేంద్ర నాథ్‌ సరస్వతి అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. ఇస్లామిక్‌ జిహాద్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతుండడాన్ని ఈ సమావేశం ఖండించింది. వక్ఫ్‌ బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేసింది. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాటం చేస్తున్న ఘాజియాబాద్‌లోని దన్సాదేవి మందిర ప్రధాన అర్చకుడు, మహామండలేశ్వర్‌ యతి నరసింగానంద్‌ గిరికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది.