News

వైభవంగా శోభాయాత్ర

330views

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ, వీహెచ్ పీ, హిందూ సంఘాల నాయకులు శోభాయాత్ర, బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణ శివారుల్లోని మన్నూరు వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయం నుంచి వత్తలూరు రోడ్డులో ఉన్న రామాలయం వరకు శోభాయాత్ర ర్యాలీ సాగింది. అలానే ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా అధికారి సి.విశ్వనాథ్, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని పెనగలూరు మండల కేంద్రంలోనూ రాముని శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏడాది కావడంతో గ్రామస్తులు ఈ శోభాయాత్ర నిర్వహించారు. రామాలయం నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు శోభాయాత్రను గ్రామస్తులు జై శ్రీరామ్ అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు.