News

ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు తప్పనిసరి : మహాకుంభమేళాలో విశ్వహిందూ పరిషత్

253views

దేశంలో హిందూ జనభా తగ్గడంపై విశ్వహిందూ పరిషత్‌(VHP)ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశ జనభాలో అసమతూకం ఏర్పడుతోందని వివరించింది. ఇందుకు విరుగుడుగా ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది.

మహాకుంభ్‌ నగర్‌లో శనివారం జరిగిన విరాట్‌ సంత్‌ సమ్మేళన్‌లో వీహెచ్‌పీ సెంట్రల్‌ జనరల్‌ సెక్రటరీ బజ్‌రంగ్‌ లాల్‌ బాంగ్రా ఈ ప్రకటన చేశారు. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలని హిందూ సమాజంలోని గౌరవనీయులైన సాధువులు కోరుతున్నారు’అని అన్నారు.గోరక్షా పీఠాదీశ్వర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ కుంభమేళాలోసనాతన భారత ధర్మం ప్రత్యక్షంగా కనిపిస్తోందని, ప్రపంచం మొత్తం దీనిని చూస్తోందని అన్నారు.బంగ్లాదేశ్‌లో ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడులు జరగడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.

కుంభమేళాలో జరిగిన కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య స్వామి వాసుదేవానంద అధ్యక్షత వహించారు.