
350views
తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధ తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఉన్న మహానంది విగ్రహానికి ఏటా కనుమ రోజు వేడుక నిర్వహిస్తారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 2 టన్నుల కూరగాయలు, పండ్లు, స్వీట్లు, పువ్వులతో అలంకరించారు. అనంతరం విగ్రహం ఎదుట 108 ఆవులతో గోపూజ చేశారు. నందికి అలంకరించిన కూరగాయలు, పండ్లు, స్వీట్లను భక్తులకు ప్రసాదంగా అందించారు.





