
53views
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కైంకర్యాలు పూర్తయ్యాక శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరుచ్చిలపై పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ పూజాది క్రతువులు నిర్వహించాక శ్రీమలయప్పస్వామి వేటకు బయలుదేరారు. స్వామి తరఫున అర్చకులు ఈటెను మూడుసార్లు విసిరారు. అంతకుముందు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి శ్రీసన్నిధి గొల్లభాగ్య చరితం పుస్తకాన్ని ఆవిష్కరించారు.