
273views
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీ పాక్‌లో జరిగితే తమ జట్టును అక్కడికి పంపబోమని బీసీసీఐ.. ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ.. పీసీబీకి తెలియజేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా అంగీకరించాలని కోరింది. దీనిపై పాక్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహరం కొనసాగుతున్నవేళ.. భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించగా వాటిని భారత హైకమిషన్ చూసిచూడనట్లుగా వదిలేసింది. తాజాగా ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని ప్రకటించింది.





