
కార్తీక మాసం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా , చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీరం ఓడ్డున శివునికి ప్రత్యేక పూజలు ,అనంతరం శాస్త్రోక్తంగా సాగర హారతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు డా”దేవరాజు, బండారు జ్వాల మాట్లాడుతూ ఈనెల 15న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని హైందవ శంఖారావం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా సామూహికంగా సాగర హారతి, శివపార్వతులకు ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహిస్తున్నమని చెప్పారు.మొదటిసారిగా వాడరేవులో సాగర్ తీరంలో ఈ సాగర హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సాగర హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాలను అర్చకులు కారంశెట్టి నగేష్ కుమార్ ,వెంకటేష్, గోపి రఘు, పర్యవేక్షించారు.





